కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే ఋజుమార్గమని ఎవరికైనా ఎలా తెలుస్తుంది?
1- మనందరి దైవమైన అల్లాహ్ ఏకైకుడు, అద్వితీయుడు, అపూర్వుడు, పరిపూర్ణుడు, సర్వలోకాల ప్రభువు మరియు సృష్టికర్త అని బోధిస్తున్న ఏకైక ధర్మం ఇస్లాం ధర్మం మాత్రమే.
2- కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి గానీ జీసస్ ను లేదా విగ్రహాలను లేదా దైవదూతలను ఆరాధించకూడదని పూర్తిగా విశ్వసిస్తున్న ధర్మం కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే.
3- 1400 సంవత్సరాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథంలో ఎలాంటి వైరుధ్యాలు, వ్యత్యాసాలు లేవు. దానిలో అనేక వైజ్ఞానిక వాస్తవాలు ప్రస్తావించబడినాయి. కేవలం ఈ మధ్య మాత్రమే వాటిలో కొన్నింటిని శాస్త్రజ్ఞులు ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కనిపెట్టారు, మరికొన్నింటిని కనిపెట్టే పరికరాలను తయారు చేసే స్థాయికి ఇంకా వారు చేరుకోలేదు. కాబట్టి, ఖుర్ఆన్ గ్రంథం ఎన్నడూ సైన్సుకు విరుద్ధంగా లేదు.
4- ఖుర్ఆన్ లోని ఒక్క అధ్యాయం వంటి అధ్యాయాన్నైనా తయారు చేయమని అల్లాహ్ సవాలు చేసినాడు. అంతేగాక, ఎవ్వరూ ఎన్నడూ ఆయన సవాలును ఎదుర్కోలేరని కూడా స్పష్టంగా తెలిపినాడు. గత 14 శతాబ్దాల నుండి ఈనాటి వరకు అది తిరుగులేని సవాలుగా అలాగే నిలిచి ఉన్నది.
5- నిశ్చయంగా మొత్తం చరిత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి. ఒక ముస్లిమేతరుడు రచించిన “The 100 most influential men in History” (అంటే చరిత్రలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది పురుషులు) అనే పుస్తకంలో ఆయన మొట్టమొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరియు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంకు 3వ స్థానం ఇచ్చినాడు. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం కూడా అల్లాహ్ పంపిన ప్రవక్తయే అనే విషయాన్ని మనం ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాలి.