విషయం

స్థాయిలోనున్న విషయం

యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు

యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు

articles

దివ్యఖుర్ఆన్ వారిని “గ్రంథ ప్రజలు” అని సంబోధిస్తున్నది, అంటే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు దివ్యసందేశాన్ని అందుకున్నారు. వారిని గౌరవించాలని, న్యాయంగా వ్యవహరించాలని మరియు వారు స్వయంగా ఇస్లాంకు వ్యతిరేకంగా విరోధం చూపడం లేదా ఇస్లాంను ఎగతాళి చేయడం వంటివి చేయనంత వరకు వారితో పోరాడకూడదని ముస్లింలకు ఆదేశించబడింది. ఏదో ఒకనాడు వారు కూడా అల్లాహ్ ను ఆరాధించడంలో తమతో పాటు కలిసి ముందడుగు వేస్తారేమో మరియు అల్లాహ్ కు సమర్పించుకుంటారేమోనని చివరికి ముస్లింలు వారిపై ఆశ పడుతున్నారు. 

- ఇస్లాం ధర్మం ముస్లిం మహిళలను అణిచి పెడుతున్నదా

- ఇస్లాం ధర్మం ముస్లిం మహిళలను అణిచి పెడుతున్నదా

articles

అస్సలు కాదు. వాస్తవం ఏమిటంటే మీడియాలో కొందరు వ్యాపింపజేస్తున్న తప్పుడు ప్రచారాలకు విరుద్ధంగా, ఇస్లాం ధర్మం 1,400 సంవత్సరాలకు పూర్వమే విడాకులు పొందే హక్కు, ఆర్ధిక స్వాతంత్ర్య హక్కు, హిజాబ్ ధరించడం ద్వారా శీలవతిగా గౌరవింపబడే మరియు గుర్తింపబడే హక్కులు ఇచ్చి స్త్రీల స్థాయిని ఉన్నత పరిచింది. 

ఇస్లాం ధర్మం బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తుందా

ఇస్లాం ధర్మం బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తుందా

articles

ఎంత మాత్రమూ కాదు. ఇస్లాం ధర్మం బహుభార్యాత్వానికి అనుమతినిచ్చిందే గానీ అది తప్పనిసరి అని ఆదేశించలేదు. చారిత్రకంగా, అసలు పెళ్ళి చేసుకోని ఒక్క జీసస్ అలైహిస్సలాం తప్ప, ప్రవక్తలందరూ ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండేవారు.

ఇస్లాం ధర్మం హింస మరియు ఉగ్రవాదాన్ని, ఆతంకవాదాన్ని ప్రోత్సహిస్తున్నదా

ఇస్లాం ధర్మం హింస మరియు ఉగ్రవాదాన్ని, ఆతంకవాదాన్ని ప్రోత్సహిస్తున్నదా

articles

అస్సలు కాదు. ఇస్లాం ధర్మం శాంతి, దైవసమర్పణ, మానమర్యాదలు, ప్రేమాభిమానాలు, దయ మొదలైన ఉత్తమ నైతిక విలువలు కలిగిన ఒక సత్యధర్మం. మానవ జీవితాల భద్రత నొక్కి వక్కాణిస్తుంది. 

ఇస్లాం ధర్మంలో ఆరాధనల అసలు ఉద్దేశ్యం ఏమిటి?

ఇస్లాం ధర్మంలో ఆరాధనల అసలు ఉద్దేశ్యం ఏమిటి?

articles

ఆరాధనల అసలు ఉద్దేశ్యం అల్లాహ్ యొక్క భయభక్తులు అలవర్చుకోవడం. కాబట్టి, అది నమాజు అయినా, ఉపవాసం లేక దానధర్మాలైనా అవి మనలన్ని అల్లాహ్ కు దగ్గరగా తీసుకువెళతాయి. ఎప్పుడైతే ఒకరి ఆలోచనలలో మరియు ఆచరణలలో అల్లాహ్ యొక్క భయభక్తులు పాదుకొంటాయో, ఆ వ్యక్తి ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఎక్కువగా ప్రసాదింపబడే ఉత్తమ స్థానం పైకి చేరుకుంటాడు. 

“మీరు చూడలేని, వినలేని, స్పర్శించలేని, వాసన చూడలేని, రుచి చూడలేని, ఎలా ఉంటాడో కనీసం ఊహించను కూడా ఊహించలేని దేవుడిని మీరు ఎలా విశ్వసిస్తారు?”

“మీరు చూడలేని, వినలేని, స్పర్శించలేని, వాసన చూడలేని, రుచి చూడలేని, ఎలా ఉంటాడో కనీసం ఊహించను కూడా ఊహించలేని దేవుడిని మీరు ఎలా విశ్వసిస్తారు?”

articles

వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవ్వరూ అల్లాహ్ ను చూడలేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనల ద్వారా మనం తెలుసుకున్నాము. ఏ విధంగానైనా ఆయన దరి చేరేలా మన పంచేద్రియాలను ఉపయోగించే శక్తిసామర్ధ్యాలు మనకు లేవు. 

ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి?

ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి?

articles

ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను మరియు ఆయన తల్లి కన్య మేరీలను ముస్లింలు ఎంతో గౌరవిస్తారు. తండ్రి లేకుండా పుట్టిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాం యొక్క పుట్టుక ఒక మహిమ అని ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది. 

ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలు – రెండింటి మూలస్థానాలు ఒక్కటేనా లేక వేర్వేరా ?

ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలు – రెండింటి మూలస్థానాలు ఒక్కటేనా లేక వేర్వేరా ?

articles

యూదమతంతో పాటు, వాటి మూలాలు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు పోయి కలుస్తాయి. ఈ మూడు ధర్మాల ప్రవక్తలు తిన్నగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇద్దరు కుమారుల సంతతి నుండే ఎంచుకోబడినారు. 

ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లుహు అలైహి వసల్లంను ఆరాధిస్తారా?

ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లుహు అలైహి వసల్లంను ఆరాధిస్తారా?

articles

ఖచ్ఛితంగా లేదు. ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గానీ, మరే ప్రవక్తను గానీ అస్సలు ఆరాధించరు. ఆదం, నూహ్, ఇబ్రాహీమ్, దావూద్, సులైమాన్, మూసా మరియు జీసస్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలతో పాటు మొత్తం ప్రవక్తలందరినీ ముస్లింలు నమ్ముతారు. 

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అల్లాహ్ యొక్క ప్రవక్తగా మరియు సందేశహరుడిగా మారినారు ?

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అల్లాహ్ యొక్క ప్రవక్తగా మరియు సందేశహరుడిగా మారినారు ?

articles

40 యేళ్ళ వయస్సులో, మొట్టమొదటిసారి హీరా గుహలో ఏకాంతంగా ఉన్నప్పుడు, దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయనకు కనబడి, అల్లాహ్ నుండి తొలి దివ్యవాణిని అందజేసి, అల్లాహ్ ఆయనను అంతిమ ప్రవక్తగా ఎంచుకున్నట్లు తెలిపినారు. ఆనాటి నుండి 23 సంవత్సరాల వరకు దివ్యవాణి ఆయనపై అవతరించింది. 

ముస్లిం అంటే ఎవరు ?

ముస్లిం అంటే ఎవరు ?

articles

ముస్లిం” అనే పదానికి అర్థం “నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త”ని ప్రకటిస్తూ, అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా తనను తాను సమర్పించుకున్నవాడు. మరోమాటలో చెప్పాలంటే ఎవరైతే తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారో, అతడిని ముస్లిం అంటారు. 

కఅబహ్ గృహం అంటే ఏమిటి ?

కఅబహ్ గృహం అంటే ఏమిటి ?

articles

కఅబహ్ (అరబీలో: అల్ కఅబహ్ : [అర్థం], “ఘనాకారం”), ఇదొక ఘనాకార కట్టణం, ఇది సౌదీఅరేబియా లోని మక్కా నగరంలో ఉన్న ముస్లింల అత్యంత పవిత్రమైన అల్ మస్జిద్ అల్ హరమ్ మధ్యలో ఉన్నది. 

అల్లాహ్ అంటే ఎవరు ?

అల్లాహ్ అంటే ఎవరు ?

articles

అల్లాహ్ అనేది అరబీ భాషలో “ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు“ యొక్క స్వంత పేరు. అల్లాహ్ కేవలం ముస్లింల కొరకు మాత్రమే ఆరాధ్యుడు కాదు, ఆయన సృష్టిలోని ప్రతిదానికీ ఆరాధ్యుడు ఎందుకంటే వాటన్నింటినీ సృష్టించింది మరియు పోషిస్తున్నదీ ఆయనే. 

ఇస్లాం అంటే ఏమిటి ?

ఇస్లాం అంటే ఏమిటి ?

articles

“ఇస్లాం” అనే అరబీ పదానికి అర్థం శాంతి మరియు సమర్పణ. శాంతి అంటే స్వయంగా ప్రశాంతత కలిగి ఉండటం మరయు మీ చుట్టుప్రక్కల కూడా. అలాగే సమర్పణ అంటే ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా సమర్పించుకోవడం.