ఇస్లాం ధర్మం హింస మరియు ఉగ్రవాదాన్ని, ఆతంకవాదాన్ని ప్రోత్సహిస్తున్నదా

అస్సలు కాదు. ఇస్లాం ధర్మం శాంతి, దైవసమర్పణ, మానమర్యాదలు, ప్రేమాభిమానాలు, దయ మొదలైన ఉత్తమ నైతిక విలువలు కలిగిన ఒక సత్యధర్మం. మానవ జీవితాల భద్రత నొక్కి వక్కాణిస్తుంది. ఖుర్ఆన్ ప్రకటిస్తున్నది, [5వ అధ్యాయం, 32వ వచనం], “ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడితే, అతడు మొత్తం మానవజాతిని కాపాడినట్లే మరియు అకారణంగా ఎవరైనా ఒక వ్యక్తిని హత్యచేస్తే, అతడు మొత్తం మానవజాతిని హత్య చేసినట్లే.” క్రూసేడు దాడులు, స్పెయిన్ మరియు రెండవ ప్రపంచ యుద్ధంలోని హింస లేదా బోస్నియాలో క్రైస్తవ సెర్బులు ఒడిగట్టిన ముస్లింల ఊచకూతలు లేదా రెవరండ్ జిమ్ జోన్స్, డేవిడ్ కొరేష్, డాక్టర్ బరుచ్ గోల్డ్ స్మిత్ వంటి దౌర్జన్యపరుల దాడులు మొదలైన అన్ని రకాల హింసలను మరియు దౌర్జన్యాలను ఇస్లాం పూర్తిగా ఖండిస్తున్నది. హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే వారెవరైనా సరే, అలాంటి వారు తమ ధర్మోపదేశాలను అస్సలు అనుసరించడం లేదు. ఎందుకంటే ఏ ధర్మమూ వాటిని ప్రోత్సహించదు.

అయితే, ఒక్కోసారి ఫాలస్తీను పౌరుల వలే అణచివేతకు గురవుతున్న ప్రజల వద్ద తిరుగుబాటు తప్ప వేరే మార్గం ఉండక పోవచ్చు. ఇది తప్పు అయినప్పటికీ, ఇతర దేశాల దృష్టిని ఆకర్షించేందుకు ఇదొక్కటే మార్గమని వారు భావిస్తూ ఉండ వచ్చు. అయితే కొందరు ఇస్లాం వలనే ఇలాంటి తిరుగుబాటు జరుగుతుందని భావిస్తున్నారు. మరి ఇస్లాం ఉనికి లేని అనేక ప్రాంతాలలో కూడా ఎంతో తీవ్రమైన టెర్రరిజం మరియు హింస జరుగుతున్నది కదా. మరి దానికేమంటారు ?

ఉదాహరణకు, ఐర్లాండ్, దక్షిణ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు శ్రీలంకా మొదలైన దేశాలలోని ఉగ్రవాదం. కొన్నిసార్లు హింసా దౌర్జన్యాలు, ఉగ్రవాదమనేది ఆక్రమించిన దౌర్జన్యపరుల మరియు దురాక్రమణకు గురైన నిస్సహాయుల మధ్య జరిగే పోరాటం లేదా అణచివేతకు గురవుతున్న మరియు అణచివేస్తున్న వారిరువురి మధ్య జరిగే పోరాటం కావచ్చు. ప్రజలు ఎందుకు టెర్రరిస్టులుగా మారుతున్నారో కనిపెట్టవలసిన అవసరం ఎంతో ఉన్నది. దురదృష్టవశాత్తు, తమ హక్కుల కోసం పోరాడుతున్న ఫాలస్తీనా ప్రజలు టెర్రరిస్టులని పేర్కొనబడుతుండగా, నిస్సహాయులైన ఫాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణచి వేస్తుండటమే కాకుండా తమ స్వంత ప్రజలపై కూడా దౌర్జన్యాలు చేస్తున్న సాయుధ ఇస్రాయీలీ దురాక్రణదారులు మాత్రం టెర్రరిస్టులుగా పేర్కొనబడటం లేదు. ముస్లిమేతర టెర్రరిస్టులు చేసిన ఓక్లహామా సిటీ బాంబింగ్ కేసులో వలే అనేక చోట్ల ఎలాంటి ఆధారాలు లేకుండా మరియు అసలు విచారణ మొదలు కాకుండానే మీడియాలో ముస్లింలను దోషులుగా నిలబెడుతున్నారు. కొన్నిసార్లు శాంతిని కోరుకునేవారు మరియు శాంతిని వ్యతిరేకించేవారు ఉభయులూ ఒకే ధర్మానికి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మీ భాషను ఎంచుకోండి