ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు (మూలసిద్ధాంతాలు) ఏవి ?

ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు ఐదు. అవి:


1. షహాదహ్ అంటే సాక్ష్యప్రకటన: ఒక్క అల్లాహ్ తప్ప, ఆరాధింపబడే అర్హత గల వారెవ్వరూ లేరని మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమివ్వడం. 

2. సలాహ్ – నమాజు: ప్రతిరోజూ ఐదు సార్లు నమాజు చేయడం.

3. సౌమ్ – ఉపవాసం : రమదాన్ నెల మొత్తం విధిగా ఉపవాసం పాటించడం. 

4. జకాతు – విధిదానం : ధనవంతుల సంపదలోని పేదప్రజల హక్కు. 

5. హజ్ యాత్ర : శారీరకంగా మరియు ఆర్ధికంగా తగిన స్తోమత గలవారు జీవితంలో కనీసం ఒక్కసారి మక్కా వెళ్ళి, హజ్ యాత్రలో పాల్గొనడం. 
ఉదాహరణకు – ఒకవేళ మన వద్ద ఒక బిల్డింగు ప్లాను ఉందని అనుకుందాము. దానికి ఒక మంచి ఆకారాన్నిస్తూ  నిర్మించాలంటే, దాని మూలస్థంభాలన్నీ ఎత్తులో మరియు దృఢత్వంలో సమానంగా ఉండాలి. 

ఇస్లాం ధర్మం విషయంలో కూడా అంతే. ఒక ముస్లింగా తప్పక ఇస్లామీయ మూలస్థంభాలన్నింటినీ సరిసమానంగా ఆచరించ వలసి ఉన్నది.

ఉదాహరణకు, రమదాన్ నెల ఉపవాసాలు పాటించకుండా లేక ప్రతిరోజూ ఐదు పూటలా నమాజులు చేయకుండా హజ్ యాత్ర చేస్తే చాలని భావించడం సరికాదు. 

ఒక బిల్డింగులో కేవలం పిల్లర్స్ అంటే మూలస్థంభాలు మాత్రమే ఉన్నాయని భావించుదాం. అలాంటి స్థితిలో అదొక బిల్డింగ్ యే అనబడదు. దానిపై కప్పు ఉండాలి. దానికి గోడలు, తలుపులు మరియు కిటికీలు మొదలైనవి ఉండాలి. అప్పుడే అది ఒక బిల్డింగు అని పిలబడుతుంది.  

ఇస్లాం ధర్మం విషయం కూడా అంతే. ఇస్లాం ధర్మంలో కేవలం మూలస్థంభాలు మాత్రమే లేవు. దానిలో ఇస్లామీయ నైతికత అనబడే నిజాయితీ, సత్యత, దయాగుణం, దానధర్మాలు, ఇతరులను గౌరవించడం, ఇంకా ఇలాంటి అనేక ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి, ఒక ముస్లింగా జీవించాలంటే, కేవలం ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలను మాత్రమే ఆచరిస్తే సరిపోదు, వాటితో పాటు ఒక మంచి మానవుడి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేందుకు వీలయినంత ఎక్కువగా, శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే ఆ బిల్డింగు నిర్మాణం పూర్తయి, ఎంతో అందంగా కనబడుతుంది.

Choose Your Language