దివ్యఖుర్ఆన్ వారిని “గ్రంథ ప్రజలు” అని సంబోధిస్తున్నది, అంటే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు దివ్యసందేశాన్ని అందుకున్నారు. వారిని గౌరవించాలని, న్యాయంగా వ్యవహరించాలని మరియు వారు స్వయంగా ఇస్లాంకు వ్యతిరేకంగా విరోధం చూపడం లేదా ఇస్లాంను ఎగతాళి చేయడం వంటివి చేయనంత వరకు వారితో పోరాడకూడదని ముస్లింలకు ఆదేశించబడింది. ఏదో ఒకనాడు వారు కూడా అల్లాహ్ ను ఆరాధించడంలో తమతో పాటు కలిసి ముందడుగు వేస్తారేమో మరియు అల్లాహ్ కు సమర్పించుకుంటారేమోనని చివరికి ముస్లింలు వారిపై ఆశ పడుతున్నారు.
“(ఓ ముహమ్మద్) వారికి చెప్పు: ఓ గ్రంథ ప్రజలారా! మాలోనూ, మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ ను వదిలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనుక వారు విముఖత చూపితే, “మేము మాత్రం ముస్లింలము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.”
మరి హిందువులు, బహాయి, బౌద్ధులు మరియు ఇతర ధర్మాలను అనుసరించే ప్రజలతో ఎలా వ్యవహరించాలి? వారితో కూడా కనికరం, దయ, గౌరవమర్యాదలతో వ్యవహరించాలి మరియు ఇస్లాం ధర్మం వైపు పిలుస్తున్న తమ ఆహ్వానం వారికి అర్థం అయ్యేలా మంచిగా ప్రవర్తించాలి.