విషయం

content

Content of article

క్లుప్తంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోని ఉత్తమ తెగలలో ఒకటైన ఖురైష్ తెగలో క్రీ.శ. 570వ సంవత్సరంలో జన్మించారు. ఆయన ప్రవక్త ఇబ్రాహీమ్ జ్యేష్ఠ కుమారుడైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం వంశానికి చెందుతారు. ఆయన జన్మించక ముందే ఆయన తండ్రి చనిపోయారు మరియు ఆరెళ్ళ వయస్సులో తల్లి కూడా చనిపోయింది. ఆయన ఏ పాఠశాలలోనూ చదువుకోలేదు. ఎందుకంటే ఆనాటి ఆచారం ప్రకారం బాల్యంలో ఆయన ఒక పల్లెటూళ్ళో ముందుగా హలీమా అనే ఆమె వద్ద పెరిగారు, తర్వాత కొన్నేళ్ళు తాత వద్ద మరియు పినతండ్రి వద్ద పెరిగారు. యవ్వనంలో ఆయన ఎంతో ఉత్తముడు, నిష్కళంకుడు, సత్యవంతుడు, దయాళువు, గౌరవనీయుడు మరియు నిజాయితీపరుడిగా ప్రఖ్యాతి గాంచినారు. తరుచుగా హీరా గుహలో రోజులు తరబడి ఏకాంతంగా గడిపేవారు.

కామెంట్లు