ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలు – రెండింటి మూలస్థానాలు ఒక్కటేనా లేక వేర్వేరా ?

యూదమతంతో పాటు, వాటి మూలాలు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు పోయి కలుస్తాయి. ఈ మూడు ధర్మాల ప్రవక్తలు తిన్నగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇద్దరు కుమారుల సంతతి నుండే ఎంచుకోబడినారు. 
1. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క పెద్దకుమారుడైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంచుకోబడినారు. 


2. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క రెండవ కుమారుడైన ప్రవక్త ఇస్హా అలైహిస్సలాం సంతతి నుండి ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త జీసస్ అలైహిస్సలాం మొదలైనవారు ఎంచుకోబడినారు. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఒక పట్టణాన్ని స్థాపించారు. ఈనాడు అది మక్కా పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంకా అక్కడ కాబాగృహాన్ని నిర్మించారు. ఈనాడు ప్రతిరోజూ ఐదు పూటలా నమాజు చేసేటప్పుడు ముస్లింలు కాబాగృహం దిక్కు వైపుకే తిరిగి నిలబడతారు. 

Choose Your Language