ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లుహు అలైహి వసల్లంను ఆరాధిస్తారా?

ఖచ్ఛితంగా లేదు. ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గానీ, మరే ప్రవక్తను గానీ అస్సలు ఆరాధించరు. ఆదం, నూహ్, ఇబ్రాహీమ్, దావూద్, సులైమాన్, మూసా మరియు జీసస్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలతో పాటు మొత్తం ప్రవక్తలందరినీ ముస్లింలు నమ్ముతారు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త అని కూడా నమ్ముతారు. కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడనీ, ఏ మానవుడూ ఆరాధనలకు అర్హుడు కాదని వారు దృఢంగా నమ్ముతారు.

Choose Your Language