కఅబహ్ గృహమనేది ముస్లింలందరూ తాము ప్రతిరోజు చేసే ఐదుపూట్ల నమాజు కోసం అభిముఖంగా నిలబడే ఆరాధనా స్థలం. అల్లాహ్ దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం దీనిని నిర్మించమని ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాంలను ఆదేశించాడు. ఇదొక రాతి కట్టడం. ప్రవక్త ఆదం అలైహిస్సలాం నిర్మించిన అల్లాహ్ యొక్క మొట్టమొదటి ఆరాధనాలయం యొక్క అసలు పునాదులపైనే ఇది నిర్మించబడిందని చాలా మంది విశ్వాసం. దీనిని సందర్శించేందుకు మొత్తం మానవజాతిని ఆహ్వానించమని అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆదేశించినాడు. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పిలుపుకు స్పందిస్తూ యాత్రికులు అక్కడికి చేరుకున్న తర్వాత ‘లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటే హాజరయ్యాం, ఓ ప్రభూ హాజరయ్యాం’ అని పలుకుతారు.
కఅబహ్ (అరబీలో: الكعبة అల్ కఅబహ్ : [అర్థం], “ఘనాకారం”), ఇదొక ఘనాకార కట్టణం, ఇది సౌదీఅరేబియా లోని మక్కా నగరంలో ఉన్న ముస్లింల అత్యంత పవిత్రమైన అల్ మస్జిద్ అల్ హరమ్ మధ్యలో ఉన్నది.