ఇస్లాం అంటే ఏమిటి ?

“ఇస్లాం” అనే అరబీ పదానికి అర్థం శాంతి మరియు సమర్పణ. శాంతి అంటే స్వయంగా ప్రశాంతత కలిగి ఉండటం మరయు మీ చుట్టుప్రక్కల కూడా. అలాగే సమర్పణ అంటే ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా సమర్పించుకోవడం.

ఇస్లాం ధర్మం నైతిక విలువలను మరియు జీవన శైలిని సూచించే పేరు కలిగున్న ఒక సంపూర్ణ ఏకైక ధర్మం. యూదమతం దాని పేరును జూడా తెగ నుండి తీసుకున్నది, క్రైస్తవమతం దాని పేరును క్రీస్తు నుండి తీసుకున్నది, బౌద్దమతం దాని పేరును గౌతమబుద్ధుడి నుండి తీసుకున్నది, హిందూమతం దాని పేరును సింధూ నది నుండి తీసుకున్నది. అయితే ముస్లింలు తమ గుర్తింపును ఇస్లాం పేరు నుండి తీసుకున్నారే గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు నుండి కాదు. కాబట్టి, వారిని “ముహమ్మదీయులు” అని పిలవడం సరైన పద్ధతి కాదు.

మీ భాషను ఎంచుకోండి