ఆరాధనల అసలు ఉద్దేశ్యం అల్లాహ్ యొక్క భయభక్తులు అలవర్చుకోవడం. కాబట్టి, అది నమాజు అయినా, ఉపవాసం లేక దానధర్మాలైనా అవి మనలన్ని అల్లాహ్ కు దగ్గరగా తీసుకువెళతాయి.
ఎప్పుడైతే ఒకరి ఆలోచనలలో మరియు ఆచరణలలో అల్లాహ్ యొక్క భయభక్తులు పాదుకొంటాయో, ఆ వ్యక్తి ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఎక్కువగా ప్రసాదింపబడే ఉత్తమ స్థానం పైకి చేరుకుంటాడు.