విషయం

content

Content of article

ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను మరియు ఆయన తల్లి కన్య మేరీలను ముస్లింలు ఎంతో గౌరవిస్తారు. తండ్రి లేకుండా పుట్టిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాం యొక్క పుట్టుక ఒక మహిమ అని ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది.

“అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. అతన్ని మట్టితో చేసి: అయిపో అని ఆజ్ఞాపించగా అతను (మనిషిగా) అయిపోయాడు” 

(ఖుర్ఆన్ 3.59)

“ఒక ప్రవక్తగా అల్లాహ్ అనుజ్ఞతో ఆయన తన తల్లి శీలాన్ని ధృవీకరిస్తూ, పుట్టిన వెంటనే ఆయన ప్రజలకు జవాబివ్వడం, అంధులకు దృష్టి ప్రసాదించడం, కుష్టు రోగులను నయం చేయడం, మృతులను తిరిగి సజీవులుగా చేయడం, మట్టి నుండి పక్షిని తయారు చేయడం వంటి అనేక మహిమలు ప్రదర్శించారు. అన్నింటి కంటే ముఖ్యంగా అల్లాహ్ యొక్క సందేశాన్ని అందజేయడం. ఖుర్ఆన్ ప్రకారం, ఆయన అస్సలు శిలువ వేయబడలేదు, స్వర్గంలోనికి ఎత్తుకోబడినారు”. 

(ఖుర్ఆన్, మర్యమ్ అధ్యాయం)

కామెంట్లు