ఖుర్ఆన్ అంటే ఏమి ?

దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అరబీ భాషలో అవతరించిన అసలు వచనాల సంకలనమే ఖుర్ఆన్ గ్రంథం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించగా, ఆయన దానిని తన సహచరులకు బోధించారు. కొందరు సహచరులు దానిని వ్రాతపూర్వకంగా భద్రపరచగా, మరికొందరు కంఠస్థం చేసి మరీ భద్రపరచుకున్నారు. ఆయన జీవిత కాలంలోనే ఆ సహచరులు ఆయనకు చదివి వినిపించి మరీ ధృవీకరించుకున్నారు. అనేక శతాబ్దాలు దాటినా దానిలోని 114 అధ్యాయాలలో, నేటికీ ఒక్క అక్షరం కూడా మార్చ బడలేదు, ఎన్నడూ మార్పు చెందదు కూడా. కాబట్టి, ప్రతికోణంలోనూ కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 14 శతాబ్దాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథం మాత్రమే పరిపూర్ణమైనది, అద్వితీయమైనది మరియు అపూర్వమైనది. 
 
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన (అల్ అలఖ్ అధ్యాయంలోని) మొట్టమొదటి వచనాలు.

Choose Your Language