మరేమైనా దివ్య మూలాధారాలు ఉన్నాయా ?

అవును, ఉన్నాయి. అవి సున్నతులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలు మరియు ఉపమానాలు ముస్లింల కొరకు రెండో ప్రధాన ప్రామాణిక మూలాధారం. హదీథు అంటే ప్రామాణికంగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు, ఆచరణలు మరియు సహచరులకు ఇచ్చిన అనుమతులు. సున్నతులను విశ్వసించడమనేది ఇస్లామీయ విశ్వాసంలోని రెండో ప్రధాన భాగం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల కొన్ని ఉపమానాలు :

1_’ఇతరులపై దయచూపని వారిపై అల్లాహ్ కూడా దయ చూపడు.’

2_’స్వయంగా తనకోసం ఏదైనా కోరుకుంటాడో, దానినే ఇతరుల కోసం కూడా కోరుకోనంత వరకు మీలో ఎవ్వడూ నిజమైన విశ్వాసి కాజాలడు.’

3_’ప్రత్యర్థిని పడగొట్టినవాడు బలవంతుడు కాడు, కానీ తారస్థాయికి చేరుకున్న కోపంలో తనను తాను నిగ్రహించుకో గలిగినవాడే బలవంతుడు.’  (బుఖారీ, ముస్లిం, తిర్మిథీ మరియు బైహఖీ హదీథు గ్రంథాల నుండి)

మీ భాషను ఎంచుకోండి