ముస్లింలు ఖుర్ఆన్ అంటే ఏమిటి ?

ఖుర్ఆన్ అంటే జిబ్రయీల్ దైవదూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ అవతరింపజేసిన అసలు సిసలైన, ఖచ్చితమైన దివ్యవచనాల సంకలన గ్రంథం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కంఠస్థం చేయబడింది. తర్వాత ఆయన దానిని తన సహచరులకు వినిపించి, కొందరిని జ్ఞాపకం చేయని, మరికొందరిని లిఖించమని ఆదేశించారు. ఆయన జీవితకాలంలోనే మొత్తం ఖుర్ఆన్ దివ్యవచనాలు సరిచూడబడినాయి, పరస్పరం పరీక్షణం చేయబడినాయి. గడిచిన 14 శతాబ్దాలుగా ఖుర్ఆన్ లోని 114 అధ్యాయములలో (సూరాలు) ఒక్క అక్షరం కూడా మార్చబడలేదు. కాబట్టి, ఖుర్ఆన్ గ్రంథం 14 శతాబ్దాలకు పూర్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింప జేయబడినప్పటి నుండి నేటి వరకూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా, స్వచ్ఛమైన రూపంలో మిగిలి ఉన్న ఏకైక, అద్వితీయ, అపూర్వ, అసమాన మరియు అద్భుత గ్రంథం అని ప్రతి కోణంలో ఋజువు అయింది.

Choose Your Language