అల్లాహ్ యొక్క అంతిమ దివ్యావతరణ వచనమైన ఖుర్ఆన్ మే ప్రతి ముస్లిం విశ్వాసాలకు జన్మస్థానం మరియు ఆచరణలకు మూలాధారం. వివేకం, సిద్ధాంతం, ఆరాధన, చట్టం మొదలైన మనుష్య సంబంధమైన విషయాలన్నింటినీ ఖుర్ఆన్ సంబోధిస్తున్నా దాని అసలు విషయం సృష్టికర్తకు మరియు ఆయన యొక్క సృషికి మధ్య ఉండవలసిన సంబంధాన్నే స్పష్టంగా బోధిస్తున్నది. అదే సమయంలో అది ఒక న్యాయమైన, నిష్పాక్షికమైన, ధర్మబద్ధమైన సామాజిక మరియు అర్థిక వ్యవస్థల నిర్మాణం, సరైన మానవ స్వభావం కొరకు అవసరమయ్యే ఖచ్చితమైన సన్మార్గాన్ని చూపుతున్నది.