ఖుర్ఆన్ మరియు హదీథ్

ఖుర్ఆన్ – ఇది అల్లాహ్ యొక్క అంతిమ దివ్యవాణి. ఇస్లామీయ బోధనల మరియు ధర్మశాసనాల యొక్క ప్రాథమిక మూలాధారం. దైవ విశ్వాసం, సంస్కారం, మానవ జాతి చరిత్ర, ఆరాధన, జ్ఞానం, వివేకం, సమస్త విషయాలలో సృష్టికర్త మరియు సృష్టి మధ్య, పరస్పరం మానవుల మధ్య ఉండవలసిన సంబంధాల గురించి స్పష్టంగా చర్చిస్తున్నది. 

సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, చట్ట, న్యాయ, శాస్త్ర, అంతర్జాతీయ అంశాల గురించిన సమగ్ర ముఖ్యాంశాలు దీనిలో ఉన్నాయి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నిరక్షరాశి, ఆయనకు చదవటం – వ్రాయడం రాదు. అయినా, ఆయన జీవిత కాలంలోనే మరియు ఆయన పర్యవేక్షణలోనే సహచరులు దివ్యఖుర్ఆన్ వచనాలను లిఖించారు మరియు కంఠస్థం చేసారు. 

అది అవతరించబడిన అరబీ భాషలో, దాని అసలు మరియు సంపూర్ణ రూపంలో నేటికీ అందరి అందుబాటులో ఉన్నది. అనేక భాషలలో దాని భావానువాదాలు విస్తారంగా వాడుకలో ఉన్నాయి. ఇక హదీథులు అంటే తన సహచరులచే చాలా జాగ్రత్తగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు, పలుకులు మరియు ఆచరణలు. ఖుర్ఆన్ వచనాలను మరింత స్పష్టంగా వివరిస్తాయి మరియు విశదీకరిస్తాయి. 

Choose Your Language