లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధం తెలుసుకొనుట

1.1) లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధం తెలుసుకొనుట. :- అల్లాహ్ తప్ప వేరే ఇతర దేవుళ్ళెవ్వరూ లేరని, ఆయన ఒక్కడే సకల ఆరాధనలకు అర్హుడని హృదయపూర్వకముగా అర్ధం చేసుకొని నమ్మటం. 

దివ్యఖుర్ఆన్, ముహమ్మద్  47:19 :- 

"మీరు నిశ్చయంగా తెలుసుకోండి, అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హులు వెరెవ్వరూ లేరు"

ముస్లిం హదీథ్ గ్రంథం:-

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా ఉద్బోధించారు. "ఎవరైతే అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హులు వేరెవ్వరూ లేరని గ్రహించి మరణించిన ఎడల అతను స్వర్గమున ప్రవేశించును."

మీ భాషను ఎంచుకోండి