లా ఇలాహ ఇల్లల్లాహ్ యే తథ్యమని, ఎలాంటి సంకోచము లేకుండా నమ్ముట:- సకలరాశుల సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడని మనస్పూర్తిగా నమ్ముట.
దివ్యఖుర్ఆన్, హుజురాత్ 49:15 :-
అల్లాహ్ ఇలా సంబోధించెను "అల్లాహ్ పై మరియు ప్రవక్త పై ఏ విధమైన సంకోచం (అనుమానం) లేకుండా హృదయపూర్వకంగా నమ్మిన వారే నిజమైన విశ్వాసులు."
ముస్లిం హదీథ్ గ్రంథం :-
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా ఉద్బోధించారు," నిశ్చయంగా ఎవ్వరూ ఆరాధనలకు అర్హులు లేరు, కాని కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు, మరియు నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ యొక్క ప్రవక్త ' అని ఎవరైతే ఏ విధమైన అనుమానం లేకుండా నమ్మి, సాక్ష్యమిచ్చి, అల్లాహ్‌తో కలియునో వారు స్వర్గమున ప్రవేశించుటలో ఆపబడరు."